18న వరుణ్ సందేశ్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హ్యాపీడేస్’తో తెలుగులో మంచి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ‘కొత్తబంగారులోకం’తో మరింత గుర్తింపు పొందిన హీరో వరుణ్ సందేశ్. మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూన్న వరుణ్, ఆ దిశగా ఇకపై తన కెరీర్‌ను సరిగా ప్లాన్ చేసుకుంటున్నారు. కెరీర్ విషయం అలా ఉంచితే, వ్యక్తిగత జీవితంలోనూ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడం ద్వారా వరుణ్ ఓ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించిన వితిక శేరును వరుణ్ పెళ్ళాడనున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. తాజాగా వీరిద్దరి వివాహానికి కూడా ముహూర్తం ఖరారైపోయింది. ఆగస్టు 18వ తేదీన వరుణ్ సందేశ్ వివాహం జరగనుంది.