ముస్తాబవుతున్న ప్రేమమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని చైతన్య, శృతి హసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన తారాగణంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చివరి దశలో వున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, తొలిపాటను ఈనెల 18న, ఆడియోను 24న ఆవిష్కరించడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. ప్రేమతో కూడిన సంగీతభరిత దృశ్యకావ్యంగా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. ఈశ్వరీరావు, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, పృధ్వీ, నర్రా శ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ, సత్య, కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగిబ్రదర్స్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:గోపీ సుందర్, రాజేష్ మురుగేశన్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని, కెమెరా:కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, కథ:ఆల్ఫోనే్స కుథరిన్, సమర్పణ:పి.వి.డి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:చందూ మొండేటి.