అంతా ఆశీర్వదించారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అల్లు అరవింద్ ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఈనెల 5న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌కు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ‘ ఈ సినిమా పట్ల మొదటి నుంచీ పాజిటివ్ టాక్‌తో ఉన్నాను. యంగ్ డైరెక్టర్స్ తమ స్పీడ్‌ను కంట్రోల్ చేసుకుంటే అద్భుతమైన కథలు వస్తాయి. బొమ్మరిల్లు, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలు చూసి నేనుకూడా అలాంటి సినిమాలు చేస్తే బాగుండునని అనుకున్నా. శిరీష్ అలాంటి ఒక మంచి సినిమాలో నటించి సక్సెస్ అం దుకున్నాడు. ఎవరెంత కష్టపడినా సినిమా సక్సెస్‌కు డైరెక్టర్, డైరెక్టర్ టీమ్ కారణమవుతుంది.’ అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, ‘మనం ఎంత కష్టపడితే ఎంత ఎత్తుకు ఎదుగుతామో హీరో చిరంజీవిని చూస్తే అర్ధమవుతుంది. శిరీష్ నటుడిగా కష్టపడినంత కాలం ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను’ అన్నారు. హీరో శిరీష్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా నాకు నిజంగానే ‘శ్రీరస్తు శుభమస్తు’. ఈ సక్సెస్‌తో సంతృప్తి పడకుండా భవిష్యత్‌లో ఇలాగే మంచి సినిమాలు చేస్తాను. ఎన్నో హిట్ చిత్రాలనిచ్చిన మా బ్యానర్‌కి చెడ్డపేరు రాకూడదని గట్టిగా కృషి చేశా.’ అన్నారు. కార్యక్రమంలో అలీ, రావురమేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.