ఐటెం సాంగ్స్‌కు ఆద్యురాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో.. సినిమాల్లో జ్యోతిలక్ష్మి పాట వచ్చిందంటే చాలు ముసలాళ్లు కూడా కుర్రాళ్ళు అయిపోయేవారు. అంతలా తన అందచందాలతో మత్తెక్కించింది ఆమె. జ్యోతిలక్ష్మి డాన్స్‌కోసమే సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. మూడు వందలకుపైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దక్షిణాది భాషలన్నింటితోపాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి అందరి ఆదరాభిమానాలను పొందారు. ముఖ్యంగా ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి మైమరిపించింది. ఒకప్పుడు జ్యోతిలక్ష్మి పాట ఉంటే చాలు, సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉండేది. 70-80 దశకాలలో జ్యోతిలక్ష్మి పాపులర్ ఐటెం గర్ల్. ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే జనాలను ఆకట్టుకోవాలంటే తప్పకుండా ఆమె పాట పెట్టి తీరాల్సిందే.
జ్యోతిలక్ష్మి 1948లో జన్మించింది. తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టిన ఆమె ఎనిమిదిమంది తోబుట్టువుల్లో అందరికంటే పెద్ద అమ్మాయి. ఈమెను చిన్నతనం నుంచి ఎస్.పి.ఎల్.్ధనలక్ష్మి అనే నటి దగ్గర పెరిగింది. జ్యోతిలక్ష్మి ఐదేళ్ల వయసులోనే సినీరంగ ప్రవేశం చేసింది. ఐటెం సాంగ్స్ చేసి క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్‌గా ఇరవై చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో పది సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. 1963లో విడుదలైన ఎం.జి.ఆర్ చిత్రం ‘పెరియ ఇడత్తుపెణ్’ చిత్రంతో ఆమె డాన్సర్‌గా పాపులర్ అయింది. 1967లో విడుదలైన ‘పెద్దక్కయ్య’ సినిమాతో జ్యోతిలక్ష్మి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 1973లో శోభన్‌బాబు హీరోగా వచ్చిన ‘ఇదాలోకం’ సినిమాలో ‘గుడి ఎనక నా స్వామి గుర్రమెక్కి కూకున్నాడు’ అన్న పాట ఆమెకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మి చాలాకాలం తరువాత ‘కుబేరులు’ అనే సినిమాలో మళ్లీ అదేపాటకు నర్తించింది. కెరీర్ మంచి ఊపులో ఉండగానే జ్యోతిలక్ష్మి ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఆ రోజుల్లో హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడానికి ఒప్పుకునేవారు కాదు. అందుకే అప్పట్లో జ్యోతిలక్ష్మి అంటే ఓ సంచలనం. ఆమె చెల్లెలు జయమాలిని కూడా ఐటెం గర్ల్‌గా ఎంట్రీ ఇచ్చి అక్కకుమించిన పేరు తెచ్చుకుంది. జ్యోతిలక్ష్మి కూతురు జ్యోతిమీనా డాన్సర్‌గా ఎంట్రీ ఇచ్చింది. జ్యోతిలక్ష్మి అసలు పేరు జ్యోతి, పెంచుకున్న అమ్మ పేరు ధనలక్ష్మి కలిపి సినిమాల్లోకి వచ్చిన తరువాత ‘జ్యోతిలక్ష్మి’గా మారింది. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.