క్లైమాక్స్‌లో సునీల్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ నుంచి హీరోగా మారాక సునీల్ కొద్దికాలంగా మంచి హిట్ కోసం ఎంతగానో తపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే గత నెలాఖరులో జక్కన్న అనే సినిమాతో మెప్పించేందుకు వచ్చినా, ఆ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఇప్పుడు సునీల్‌కు ఒక హిట్ అనివార్యమైంది. ఈనేపథ్యంలో ఆయన వీలైనంత త్వరగా తన కొత్త సినిమా ‘ఈడు గోల్డ్ ఎహె’ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు వీరు పోట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ పూర్తిచేసుకుంటోంది. క్లైమాక్స్‌కు సంబంధించిన పలు యాక్షన్ ఎపిసోడ్స్ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తి కానుందని టీమ్ తెలిపింది. సునీల్ సరసన సుష్మారాజ్, రిచా పనాయ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.