లక్కున్నోడట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో హిట్ అందుకున్న మంచు విష్ణు హీరోగా మరో చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. గీతాంజలితో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘లక్కున్నోడు’ అనే టైటిల్‌ను ఓకె చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సత్యనారాయణ వివరాలు తెలియజేస్తూ, ‘మంచు విష్ణు మా బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఇది లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్. దీనికి ‘లక్కున్నోడు’ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది. గీతాంజలి, త్రిపుర వంటి హారర్ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కిరణ్, మొదటిసారిగా లవ్, కామెడీ బేస్డ్ సినిమా చేస్తున్నాడు. కథ వినగానే బాగా నచ్చింది. రైటర్ డైమండ్ రత్నబాబు కథ, మాటలు అందిస్తున్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో సెట్స్‌పైకి వెళ్ళే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలు తెలియజేస్తాం’ అని వివరించారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు:వి.ఎస్.ఎన్.కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి, నిర్మాత:ఎం.వి.వి.సత్యనారాయణ, దర్శకత్వం:రాజ్‌కిరణ్.