రెండక్షరాలు ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కంచెమ్మ తల్లి సినీ ప్రొడక్షన్స్ పతాకంపై లోకేశ్‌రెడ్డి, అక్షర జంటగా శ్రీనివాసరావు.ఎం. దర్శకత్వంలో పైల దేవదాస్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘రెండక్షరాలు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆడియో సీడీని హైదరాబాద్‌లో కోన రవికుమార్, తీగల కృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ప్రేమ ఇలా రెండక్షరాలతో ఎన్నో అద్భుతమైన పదాలు ఉన్నాయని, అలా ప్రేమ అనే రెండక్షరాల పదంతో వస్తున్న ఈ చిత్రంలో కథ, కథనాలు ప్రేక్షకులకు నచ్చేలా వుంటాయని, పాటలు, ట్రైలర్స్ అందరికీ నచ్చుతాయని తెలిపారు.
ప్రేమతో వచ్చిన అనేక చిత్రాలు విజయవంతం అయినట్టుగానే ఈ చిత్రం కూడా విజయవంతం అవుతుందని, నిర్మాత సహకారంతోనే చిత్రాన్ని పూర్తిచేశానని, అలాగే నటీనటులు సాంకేతిక నిపుణుల సహకారంతో అనుకున్న సమయంలోనే పూర్తిచేశానని ఆయన అన్నారు. మంచి కథ దొరకడంతో లోకేశ్‌రెడ్డి, తాను కలిసి ఈ చిత్రాన్ని రూపొందించడానికి ముందుకు వచ్చామని, ప్రేమికులు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటేనే అవి నిలబడతాయని, లేకుంటే ప్రేమికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అంశానికి సందేశం జోడించి చిత్రాన్ని రూపొందించామని పైల దేవదాస్‌రెడ్డి అన్నారు. సినిమా అంతా శ్రీకాకుళంలోనే చిత్రీకరించామని, తమ సంస్థకు మంచి పేరు తెస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో వి.సముద్ర, బెందాళం అశోక్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. కిరణ్, ఆచర్ణరెడ్డి, సుమన్‌శెట్టి, చిట్టిబాబు, నాగిరెడ్డి, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:సిద్దే సురేష్, సంగీతం:నంద, పాటలు:నందకిశోర్.కె., కెమెరా: ఇ.సత్య హరిశ్చంద్ర ప్రసాద్, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాత: పైల దేవదాస్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరావు.ఎం.