అల్లు అర్జున్‌తో మరోసారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీ హీరోయిన్ శృతిహసన్ ఈమధ్య సినిమాలు బాగా తగ్గించుకుంది. ‘శ్రీమంతుడు’ తరువాత ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో ఆమె కూడా చేయలేదు. ప్రస్తుతం పవన్ సరసన కడప కింగ్ చిత్రంలో నటిస్తోన్న ఈమె, ఇప్పుడు మరో సినిమాకు ఓకె చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం కమల్‌హసన్ నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ సినిమాలో నటిస్తోంది. రేసుగుర్రం సినిమాతో అల్లు అర్జున్‌తో జోడీకట్టి ఆ సినిమా సంచలన విజయంలో భాగం పంచుకున్న శృతిహసన్ మరోసారి అల్లు అర్జున్ సరసన నటించేందుకు ఓకె చెప్పిందట. సరైనోడు తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి రానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎయిట్ ప్యాక్‌లో కన్పిస్తాడని సమాచారం. శృతిహసన్‌కు మొదట సూపర్‌హిట్ చిత్రాన్నిచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్ కావడంతో ఆయన రూపొందించే ఈ చిత్రంలో శృతి నటించడానికి రెడీ అంటుందని తెలిసింది. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.