లవ్ బెలూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై,అంజలి జంటగా నటించిన హిట్ సినిమా ‘జర్నీ’ తరువాత మళ్లీ ఆ ఇద్దరి కాంబినేషన్‌లో 70 ఎంఎం ఫిలింస్ పతాకంపై టి.ఎన్.అరుణ్ బాలాజీ, కందస్వామి నందకుమార్ నిర్మిస్తున్న ‘బెలూన్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగినీడు ప్రధాన విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వి.రామచంద్రరావు మనవడు దర్శకుడు. తెలుగులో 17 చిత్రాలకు, అందులో హీరో కృష్ణతో 13 చిత్రాలు రూపొందించిన రామచంద్రరావు చెరగని ముద్ర వేయగా, ఇపుడు ఆయన మనవడు ఎస్.శినీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం గూర్చి దర్శకుడు వివరాలు తెలియజేస్తూ, హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జై, అంజలిల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 1989 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రొమాంటిక్ హర్రర్ చిత్రమిది. కొడైకెనాల్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అంజలి కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది.’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:యువన్ శంకర్‌రాజా, నిర్మాత:అరుణ్ బాలాజీ, కందస్వామి నందకుమార్, దర్శకత్వం:ఎస్.శినీష్.