అఖిల్ స్టెప్స్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్ హీరోగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’. ఇప్పటికే ఆడియో విడుదల కాగా, ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో అక్కినేని హీరోలు తమ అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నాగచైతన్య స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు అఖిల్ కూడా ఓ పాటలో డ్యాన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్‌కు సంబంధించిన సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ,‘సుశాంత్‌తో కలిసి ఓ పాటలో నటించడం ఆనందంగా వుంది. తప్పకుండా ఈ పాట అభిమానులకు బాగా నచ్చుతుంది’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ,‘ చైతన్య స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వడం, అఖిల్ సాంగ్‌లో డాన్స్ చేయడం ఎగ్జైటింగ్‌గా వుంది. తప్పకుండా అభిమానులందరికీ బాగా నచ్చే చిత్రమవుతుంది’ అన్నారు. నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘ఓ పాటలో మెరుపులా మెరిసి అఖిల్ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తాడు. చైతన్య స్పెషల్ ఎంట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేస్తున్నాం’అన్నారు. దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ,‘ సుశాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుంది ఇది. అతని నటన ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి పాటలు:అనూప్ రూబెన్స్, కెమెరా:దాశరధి శివేంద్ర, ఎడిటింగ్:గౌతంరాజు, కథ, మాటలు:శ్రీ్ధర్ శీపాన, నిర్మాతలు:చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, దర్శకత్వం:నాగేశ్వర్‌రెడ్డి.