మోహన్‌బాబు అంటే భయం లేదని ముందే చెప్పా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిజానికి నా 50వ సినిమా సోలో హీరోగానే చేయాలనుకున్నాను. కానీ మోహన్‌బాబుగారు ఈ సినిమా చేద్దామని అడిగినపుడు కాదనలేకపోయా’ అని అంటున్నాడు హీరో నరేష్. అల్లరి నరేష్‌గా తెలుగు పరిశ్రమలో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఆయన మోహన్‌బాబుతో కలిసి చేస్తున్న చిత్రం ‘మామ మంచు అల్లుడు కంచు’. రమ్యకృష్ణ, మీనా, పూర్ణ ముఖ్యపాత్రల్లో శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 25న విడుదలవుతున్న సందర్భంగా అల్లరి నరేష్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...
ఆయనకు ముందే చెప్పా
మోహన్‌బాబుగారితో కలిసి నటించడం భయం వేయలేదా అని చాలామంది అడుగుతున్నారు. నేను సినిమా అంగీకరించిన మొదటిరోజే ఆయన దగ్గరికి వెళ్లి మీరంటే నాకు భయం లేదు కానీ గౌరవం వుంది. మీతో చేసే సన్నివేశాల్ని పండించాలంటే నాకు కొంచెం స్వేచ్ఛ కావాలని చెప్పాను. ఆయన కూడా నటనపరంగా ఎన్నో సూచనలు ఇచ్చారు.
సోలో సినిమానే
నేను చేస్తున్న 50వ సినిమా కాబట్టి సోలో హీరోగానే చేయాలనుకున్నాను. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఘోస్ట్‌కామెడీ చేయాలని అనుకున్నాం. అయితే ప్రస్తుతం చాలావరకు అలాంటి తరహా చిత్రాలే రూపొందుతున్నాయి కాబట్టి ఈ ప్రయత్నం విరమించుకున్నాను. ఆ సమయంలోనే విష్ణు ఈ సినిమా చేయమని అడిగాడు.
డిక్షన్ నేర్చుకున్నా
మోహన్‌బాబుగారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా 20 ఏళ్ళ తరువాత వస్తున్న ‘అల్లరి మొగుడు’ చిత్రానికి రీమేక్ అని చెప్పాలి. అందులో మోహన్‌బాబుగారు ఇద్దరిని పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టడంతో ఆ సినిమా శుభం కార్డు పడుతుంది. ఆ తరువాత 25 ఏళ్ళకు ఎలా వుంటుందనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. నటన విషయంలోను, ఎక్కడ ఎలా మాట్లాడాలనే విషయం గురించి మోహన్‌బాబునుంచి తెలుసుకున్నాను.
అందరూ ప్రముఖ నటులే
ఈ సినిమాలో మోహన్‌బాబుతోపాటు రమ్యకృష్ణ, మీనా, అలీ, పూర్ణ.. ఇలా అందరూ ప్రముఖ నటీనటులతోనే చేయడం జరిగింది. అందరికీ నచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా తెరకెక్కింది. ముఖ్యంగా కామెడీని అద్భుతంగా తెరకెక్కించే శ్రీనివాసరెడ్డి, ఆయన స్టైల్లో తెరకెక్కించారు. ఇందులో 99 శాతం కామెడీనే వుంటుంది.
సక్సెస్ వున్నపుడు
సక్సెస్ వున్నపుడు అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. అందుకనే ఎక్కువ సినిమాలు చేశా. ఇంత తక్కువ సమయంలో 50 సినిమాలు పూర్తిచేయడం ఆనందంగా వుంది. మళ్లీ 51వ సినిమా నా మొదటి సినిమా అనుకుని మొదలుపెట్టాలి.
కథల నిర్ణయం నాదే
చాలామంది నాన్నగారు నా కథల విషయంలో జడ్జిమెంట్ ఇచ్చేవారని అనుకుంటారు. కానీ మొదటినుంచీ నేను చేసే సినిమాల కథల జడ్జిమెంట్ నాదే. నాకు నచ్చితే ఆ విషయాన్ని నాన్నతో చెప్పేవాణ్ణి.
సక్సెస్ కోసం
ఈమధ్య ‘సుడిగాడు’ సినిమా తరువాత వరుస అపజయాలతో కెరీర్ కాస్త వెనక్కి తగ్గింది. అయినా సరైన హిట్ కోసం ప్రయత్నాలు సాగిస్తూనే వున్నాం. ఏదైనా ఫ్లాప్ వస్తే దానికి కారణం ఎవరో ఒకరు అని అనుకోకూడదు.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. దాంతోపాటు కేశినేని వాళ్ళతో ఒక సినిమా, నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా ఓకె అయ్యింది.

-శ్రీ