మనఊరి రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడు ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ‘మన ఊరి రామాయణం’ రూపొందిస్తున్నారు. ప్రియమణి, సత్యదేవ్, పృథ్వి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని హైదరాబాద్, షాద్‌నగర్, ఆర్‌ఎఫ్‌సి, కర్నాటక కూర్గ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామని తెలిపారు. వచ్చే నెలలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ట్రైలర్ నేడు విడుదల చేస్తున్నామని, కథ గురించి చెప్పాలంటే దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి సమాజంలో గౌరవంతో ఉన్న అతని జీవితంలో శ్రీరామనవమి రోజున జరిగిన ఓ సంఘటన అతని జీవితాన్ని ఏ విధంగా మలుపుతిప్పింది అనేదే ప్రధాన అంశమని తెలిపారు.