అడవిలో వజ్రాలవేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్, సుమి, గిడ్డేష్, సమీర ప్రధాన తారాగణంగా కె.ఎస్.ఎల్. ఫిలింస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శేఖర్ చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వజ్రాల వేట’. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ- మాస్ అడ్వెంచరస్ కథాంశంతో హారర్ నేపథ్యంలో తెరెకెక్కిన ఈ చిత్రాన్ని మహానంది, నంద్యాల, గాజులపల్లె, ఓర్వకల్లు, కర్నూలు తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామన్నారు. హీరో,విలన్లమధ్య ఫైట్స్ భారీగా చిత్రీకరించామని, దాదాపు 70మంది ఛేజింగ్ ఎపిసోడ్‌లో డబుల్ కెమెరాతో చిత్రీకరించామన్నారు. ఒకేసారి వేల కోట్ల రూపాయల ధనం సంపాదిస్తే ఎలా వుంటుందనే ఆలోచన హీరో హీరోయిన్లకు, విలన్‌కు కలిగితే ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయనేదే కథాంశమని తెలిపారు. అడవిలో వజ్రాలవేట కోసం వెళ్లిన వారు ఎలా బయటపడ్డారన్నది హైలెట్‌గా వుంటుందని తెలిపారు. వినోద్‌కుమార్, శివసత్యనారాయణ, హుస్సేన్, మహేశ్వరాచారి, నందిని నటించిన ఈ చిత్రానికి కెమెరా:బి.వి.రావు, నిర్మాత:కరె శ్రీనివాసులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శేఖర్ చంద్ర.