నీ జతలేక ప్రమోషన్ సాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, పారుల్ యాదవ్, సరయు ప్రధాన తారాగణంగా శ్రీసత్య విదూర మూవీస్ పతాకంపై లారెన్స్ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజ్ గౌడ్ సిర్రా రూపొందించిన ‘నీ జతలేక’ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ టైటిల్ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలోని పాట సిట్యుయేషనల్ కామెడీతో సాగుతుందని ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. అమ్మాయిల జెలసీ నేపథ్యంలో డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందిందన్నారు. నాగశౌర్య, సరయు, పారుల్ నటన అందరికీ నచ్చుతుందని నిర్మాత చౌదరి తెలిపారు. కథలో మెయిన్ పాయింట్ అందరికీ నచ్చుతుందని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా వుంటుందని అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు కరుణాకర్, ఎ.శ్రీ్ధర్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. విసురెడ్డి, జయలక్ష్మి, బాబు, నామాల మూర్తి నటించిన ఈ చిత్రానికి సంగీతం:స్వరాజ్, కెమెరా:బుజ్జి.కె., మాటలు:శేఖర్ విఖ్యాత్, ఎడిటింగ్:నందమూరి హరి, పాటలు:రామ్ పైడిశెట్టి, గాంధి, నిర్మాతలు:జి.వి.చౌదరి, నాగరాజు గౌడ్, దర్శకత్వం:లారెన్స్ దాసరి.