కమర్షియల్ సినిమాలకే పరిమితం కాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం కమర్షియల్ సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్‌గా గుర్తింపు రాదని, అన్ని తరహా పాత్రలు చేస్తేనే హీరోయిన్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అంటోంది అందాల భామ రెజీనా కసాండ్ర. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సౌఖ్యం’. గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రెజీనాతో ఇంటర్వ్యూ...
సౌఖ్యంలో మీ పాత్ర?
ఇందులో నేను శైలజ పాత్రలో కనిపిస్తాను. ఇందులో కామెడీ కూడా చేశాను. అలాగే డాన్స్ అంటే కూడా బాగా ఇష్టం. ఈ తరహా పాత్ర ఇదివరకే ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలో కనిపిస్తుంది. మంచి పాత్ర ఇది.
ఈ సినిమా చేయడానికి కారణం?
గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. దాంతోపాటు ఇదివరకే దర్శకుడు రవికుమార్‌తో పనిచేయడం. ముఖ్యంగా కథ బాగా నచ్చడంతోపాటు ఈ బ్యానర్‌లో చేయడం బావుంటుందనిపించింది.
గోపీచంద్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్?
గోపీచంద్ చాలా కామ్‌గా, సైలెంట్‌గా వుంటాడు. తెలిసిన వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడతాడు. అలాగే సినిమా కోసం ఎంతైనా హార్డ్‌వర్క్ చేస్తాడు. తనతో పనిచేయడం చాలా హ్యాపీగా అన్పించింది.
దర్శకుడు రవికుమార్‌తో రెండోసారి చేస్తున్నారు?
‘పిల్లా నువ్వులేని జీవితం’ తరువాత ఆయనతో చేస్తున్న మరో చిత్రమిది. ఆయన నటీనటుల విషయంలో మంచి స్వేచ్ఛనిస్తారు. తనకు కావాల్సింది ఏదనే విషయంపై మంచి క్లారిటీతో వుంటారు. తనతో పనిచేయడం ఎప్పుడు హ్యాపీనే.
ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా వున్నారు?
హీరోయిన్ అన్నపుడు బిజీగానే వుండాలి కదా! ప్రస్తుతం అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, నా సినిమాల ప్లానింగ్ నేను చేయను. నా టీం చేస్తుంది. ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే. ఈ ఏడాది ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తరువాత చేస్తున్న రెండో సినిమా ఇది.
స్టార్ హీరోయిన్‌పై మీ అభిప్రాయం?
పరిశ్రమలో నెంబర్ల గురించి నేను చూడను. నాకంటూ కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. వాటిని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మనం చేస్తున్న పని పట్ల మనలో తృప్తి అనిపించాలి. సినిమాలతోపాటు నా నటన గురించి ఫ్రెండ్స్‌నడిగి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను.
వరుసగా సినిమాలు చేస్తున్నారు, ఎలా వుంది?
నిజంగానే ఆనందంగా వుంది. అయితే, నేను కంటిన్యూగా సినిమాలు చేయాలంటే కాస్త భయమేస్తోంది. రోజులో 24 గంటలు పనిచేయలేను. ఖచ్చితంగా బ్రేక్ కావాలి.
ఎలాంటి పాత్రలు చేయాలనుంది?
నేను ‘ఎస్‌ఎంఎస్’ సినిమా తరువాత కమర్షియల్ సినిమాల్లోనే హీరోయిన్‌గా నటించాలనుకున్నాను. ఆ సినిమా తరువాత ఇంత స్థాయి ఊహించలేదు. అయితే, హీరోయిన్ అంటే కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. ముఖ్యంగా నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి.
ఈమధ్య మీపై రూమర్స్ వస్తున్నాయి? వాటి గురించి?
ఏవో రూమర్స్ వస్తున్నాయని నేను కూడా వింటున్నాను. రూమర్స్‌వల్ల నా కెరీర్ ఏం మారిపోదు. ఈవిషయంపై చాలామంది అడిగారు. సాయిధరమ్ నాకు బెస్ట్‌ఫ్రెండ్. అంతకుమించి ఏమీ లేదు.
మరి ఇతర భాషల సినిమాల గురించి?
తమిళంలో ఏడాది గ్యాప్ వచ్చినా అక్కడ అవకాశాలు వస్తాయి. కానీ తెలుగులో అలా కాదు. ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తే అవకాశాలు రావడం కష్టమే. తెలుగు వదిలేసి తమిళ సినిమాలు చేయాలని అనుకోవడంలేదు.హిందీలో ఆమధ్య అవకాశాలు వచ్చాయి కానీ చేయలేదు. ఇపుడు మాత్రం పెద్దగా అవకాశాలు రావడంలేదు.
ఖాళీ సమయంలో ఏం చేస్తారు?
సినిమాలు లేనపుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. టీచ్ ఫర్ ఛేంజ్, లైఫ్ ఈజ్ బాల్, ఆదిత్యామెహతా ఫౌండేషన్.. ఇలా కొన్ని ఆర్గనైజేషన్స్‌కు పనిచేస్తున్నా.
డబ్బింగ్ చెబుతారా
ప్రస్తుతం తెలుగు బాగానే మాట్లాడుతున్నా. డబ్బింగ్ చెప్పాలని కూడా వుంది. కానీ దానికి సరైన సమయం వచ్చినపుడు చెబుతా.
తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే తెలియజేస్తా.

-యు