వంద శాతం వినోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌చంద్ర, శృతిసోది జంటగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తిచేశారు. ఈనెల 16నుండి రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని అందిస్తుందని, ఇప్పటివరకు 60 శాతం షూటింగ్ పూర్తిచేశామని తెలిపారు. రెండో షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరిపి, సినిమా పూర్తిచేస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ సినిమా రూపొందుతోందని ఆయన అన్నారు. తమ సంస్థకు ఓ మంచి చిత్రంగా నిలిచే ఈ సినిమాకు సంబంధించిన పేరును త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. పృథ్వి, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌శ్రీను, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, కెమెరా: బాల్‌రెడ్డి పి, కథ: నాగేంద్రకుమార్ వేపూరి, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, నిర్మాత: కె.కె,రాధామోహన్, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.