రవితేజ ఆటోజానీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కే 150వ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఆటో జాని’ పేరుతో ఈ సినిమా రూపొందుతుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వార్తల్లోనే ఆగిపోయింది. కథ రెండో భాగం నచ్చలేదని చిరంజీవి డ్రాప్ అయ్యాడు. అయితే ఈ కథ కాకుంటే వేరే కథతో చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అవుతున్న పూరి జగన్నాధ్ ‘ఆటో జాని’ కథను పక్కన పెట్టకుండా తన స్నేహితుడు రవితేజకు చెప్పాడట! పక్కా మాస్ అంశాలతో వున్న కథ కావడం, పైగా చిరంజీవి చేస్తాడంటూ బాగా పబ్లిసిటీ అవ్వడంతో ఆ సినిమా చేయాలని రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట! ఇటీవలే ‘బెంగాల్ టైగర్’తో మంచి జోరుమీదున్న రవితేజతో పూరి ‘ఆటోజాని’ త్వరలోనే సెట్స్‌పైకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడు.