రెగ్యులర్ షూటింగ్‌లో పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతుండగా బుధవారం నుంచి పవన్ పాల్గొంటున్నాడు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ పరాజయం తర్వాత పవన్ వెంటనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు. మొదట్లో తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం నుండి ఆయన తప్పుకోవడంతో దర్శకుడిగా గోపాల గోపాల ఫేమ్ డాలీ చేరాడు. ఇప్పటికే 20 రోజులపాటు జరిగిన షూటింగ్‌లో పవన్‌కళ్యాణ్ పాల్గొనలేదు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ప్రేమకథతో రూపొందే ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని యూనిట్ భావిస్తోందట.