26న తొలిప్రేమలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదాద్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చందన్, ఆనంది, ప్రభు ప్రధాన పాత్రల్లో తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కయల్’ చిత్రాన్ని ‘తొలిప్రేమలో’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాతలు తమటం శ్రీనివాస్, జయారపు రామకృష్ణ. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలనే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనివాస్ తమటం మాట్లాడుతూ, పాటలకు మంచి స్పందన వచ్చింది. 2016లో ‘బిచ్చగాడు’ చిత్రం ఎంత మంచి విజయం సాధించిందో అందరికీ తెలుసునని, అలాంటి మంచి విజయాన్ని ఈ సినిమా అందుకుంటుందనే నమ్మకం వుందని అన్నారు. తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే చిత్రమిదని అన్నారు. శోభారాణి మాట్లాడుతూ, ప్రతీ సీన్‌ను కళాత్మకంగా తెరకెక్కించారని, ఇప్పటివరకు ఎన్నో మంచి చిత్రాలను తీసిన ప్రభు సాల్మన్ తీసిన మరో మంచి చిత్రం ఇది అన్నారు. హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ, తమిళంలో ‘కయల్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిందని, సునామీ నేపథ్యంలో సాగే సినిమా ఇదని, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర, సత్యనారాయణ, సాయి వెంకట్, అంజి శ్రీను పాల్గొన్నారు.