స్మిత ‘బాహు కిలిక్కి’ సాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో పాప్ సింగర్‌గా ‘హాయ్బ్బ్రా’తో మంచి క్రేజ్ తెచ్చుకున్న గాయని స్మిత, ఆ తరువాత పలు ఆల్బమ్స్‌ని రూపొందించారు. కొంత గ్యాప్ తీసుకుని ‘బాహుబలి’ సినిమాలో బాగా పాపులరైన ‘కిలిక్కి’ భాషతో ఓ వీడియో ఆల్బంను రూపొందించింది స్మిత. ‘బాహు కిలిక్కి’ పేరుతో రూపొందిన ఈ వీడియో సాంగ్ బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెహర్ రమేష్, శోభూ యార్లగడ్డ, నోయల్, మదన్ కార్కి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, ఎంతో పాషన్‌తో స్మిత పనిచేస్తోందని, ఆమె రూపొందించిన ఈ సాంగ్ మంచి హిట్ కావాలని అన్నారు. స్మిత మాట్లాడుతూ, ‘బాహుబలి’ చూసిన తరువాత ‘కిలిక్కి’ భాషలో ఓ పాట చేస్తే బావుంటుందని ఆలోచన వచ్చిందని, ఆ సినిమాలో కిలిక్కి భాషను రూపొందించిన మదన్‌తో మాట్లాడి ఈ పాటకు లిరిక్స్ రాయించానని అన్నారు. ఈ వీడియో ఆల్బంకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.