పిచ్చిగా నచ్చావ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవత్సా క్రియేషన్స్ పతాకంపై సంజయ్, చేతన ఉత్తేజ్, నందు, కారుణ్య ప్రధాన తారాగణంగా వి.శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం రూపొందిస్తున్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను హీరో నాని విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ప్రేమన్నది యూనివర్సల్ అంశమైతే, ప్రేమలో వున్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటాడని, అది కూడా వ్యక్తిగతంగా వుంటుందని తెలిపారు. చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకోవడంవల్ల మనుషులతోపాటు మనస్సులు విడిపోతున్నాయని, అటువంటి అయోమయంలో పడ్డ ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం ఎలా తెలుసుకున్నాడు? తన పొరపాటును ఎలా సరిదిద్దుకున్నాడు? తన జీవితాన్ని ఆనందంగా ఎలా మలచుకున్నాడు? అనే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. చక్కని ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం ఎటువంటి వల్గారిటీ లేకుండా కుటుంబమంతా చూసేవిధంగా వుంటుందని తెలిపారు. 45 రోజులలో షూటింగ్ పూర్తిచేశామని, దర్శకుడు లావిష్‌గా చిత్రాన్ని తెరకెక్కించారని, త్వరలో ప్రచార చిత్రాలను ఆడియోను విడుదల చేసి సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన వివరించారు. ఈ సినిమా విజయవంతం అవుతుందన్న పాజిటివ్ థింకింగ్‌తో వున్నామని దర్శకుడు తెలిపారు. కార్యక్రమంలో నందు, జస్వంత్, చేతన తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: వెంకట హనుమ, సంగీతం: రాంనారాయణ, సమర్పణ: శైలజ, నిర్మాత: కమల్‌కుమార్ పెండెం, దర్శకత్వం: వి.శశిభూషణ్.