మనలో ఒకడు కోసం ఏసుదాసు గానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘మనలో ఒకడు’ చిత్రం కోసం కె.జె.ఏసుదాస్ ఓ పాటను ఆలపించారు. యూనిక్రాఫ్ట్స్ మూవీ పతాకంపై జి.సి.జగన్‌మోహన్ రూపొందిస్తున్న ‘మనలో ఒకడు’ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ బాణీకి ఏసుదాస్ గానం అందించడం విశేషమని దర్శకుడు తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఏసుదాసు పేరు వినగానే గుర్తుకువచ్చే గంధర్వగానం మరోసారి వినడానికి తాము ప్రయత్నించామని, కొంత విరామం తరువాత ఆయన తెలుగులో ఆలపించిన ఈ పాట శ్రోతలను అలరిస్తుందని, ప్రస్తుత ట్రెండ్‌కు తగిన విధంగా ఈ పాటలు కుదిరాయని తెలిపారు. కృష్ణమూర్తి అనే సామాన్య లెక్చరర్ కథనంతో సాగే ఈ చిత్రంలో యధార్థ సంఘటనలు కూడా ఉన్నాయని, ఆర్.పి.దర్శకత్వం వహించిన ‘బ్రోకర్’ ఎంత విజయం సాధించిందో, అంతే స్థాయిలో ఈ చిత్రం అందుకుంటుందని, ఈనెల 27న ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత జగన్మోహన్ తెలిపారు.