కన్నడలో కలిసొస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ నటించిన మొదటి సినిమా ‘లలీ’ మంచి హిట్‌నే అందుకున్నా ఆ తరువాత చేసిన ‘అడ్డా’ సినిమా ఫ్లాప్ అవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది అందాల భామ శాన్వి. వర్మ రూపొందించిన ‘రౌడీ’ సినిమాలో నటించినా లాభం లేకపోయింది. దాంతో ప్రస్తుతం ఇతర భాషల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ భామకు లేటెస్టుగా కన్నడలో ఓ క్రేజీ అవకాశం దక్కింది. తెలుగులో నాని హీరోగా నటించి సూపర్‌హిట్ అయిన ‘్భలే భలే మగాడివోయ్’ సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నారు. గణేశ్ హీరోగా నటించే ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తాడు. తెలుగులో లావణ్య త్రిపాఠి చేసిన పాత్రను ఈ గ్లామర్ భామ శాన్వి చేస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంది మరి.