కబాలి దర్శకుడి సినిమా ఎవరితో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అట్టకత్తి’, ‘మద్రాస్’ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా రంజిత్ ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ చిత్రాన్ని తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు. కలెక్షన్లపరంగా సునామీ సృష్టించినప్పటికీ ప్రేక్షకులను కబాలి పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ సంచలన దర్శకుడు తన తరువాతి సినిమాకోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు. పా రంజిత్ తన తరువాతి సినిమాను సూర్య లేదా విజయ్‌లతో తీస్తాడని ఇప్పటికే సంప్రదింపులు జరిగిపోయాయని వార్తలొచ్చాయి. కానీ, రంజిత్ ఈ వార్తలను ఖండించారు. ప్రస్తుతం తానూ స్క్రిప్ట్‌వర్క్‌లో ఉన్నానని, అది పూర్తయ్యేకే హీరో గురించి ఆలోచిస్తానని, తాను ఇంతవరకూ ఏ హీరోని సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు.