టీజర్‌లో కారులో షికారుకెళితే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధీరు మహేష్, సురేష్, సుదర్శన్ కళాధర్, ప్రియ, ఇషికాసింగ్ ముఖ్యపాత్రల్లో మాదాల కోటేశ్వరరావు దర్శకత్వంలో శ్రీ హరిహరా ఫిలింస్ పతాకంపై మధు, అనీష్, అభిరాం నిర్మించిన చిత్రం ‘కారులో షికారుకెళితే’. ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. టీజర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌ను మాదాల రవి ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు మాదాల కోటేశ్వరరావు మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చిందని, నటీనటుల, టెక్నీషియన్ల సహకారంతో అనుకున్న విధంగా తెరకెక్కించామని, ఆసక్తికర పాయింట్‌తో అందరికీ నచ్చే అంశాలతో చిత్రాన్ని రూపొందించామని అన్నారు. మాదాల రవి మాట్లాడుతూ, దర్శకుడు ఒన్‌మెన్ ఆర్మీ. అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాడని, ఏ సినిమాకైనా పబ్లిసిటీ ముఖ్యమని, మంచి పబ్లిసిటీ వుంటే తప్పకుండా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లచ్చని, టీజర్ బాగుందని, తప్పకుండా వీరికి మంచి విజయం దక్కాలి అన్నారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, టీజర్ చాలా ఆసక్తికరంగా వుందని, తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:చంద్రశేఖర్ వేమూరి, ఎడిటింగ్:వి.ఆర్.ఆనంద్, సంగీం:మీనాక్షి భుజంగ్, నిర్మాతలు: మధు, అనీష్, అభిరామ్, దర్శకత్వం: మాదాల కోటేశ్వరరావు.