నరుూం కథతో వర్మ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న వర్మ, అలాంటి సంచలనాత్మక చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. ముఖ్యంగా వాస్తవ కథలను సెల్యులాయిడ్ రూపం ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. రక్తచరిత్ర, వీరప్పన్, 26/11 వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించిన వర్మ, ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపనున్నారు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న గ్యాంగ్‌స్టర్ నరుూం జీవిత కథతో సినిమా చేస్తాడని తెలిసింది. ఇటీవల జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో నరుూం హతమైన విషయం తెలిసిందే. అతని మరణంతో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. అతని జీవితంపై ఆసక్తికలిగిన వర్మ, మరిన్ని వివరాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాడట. నక్సలైట్ నుండి పోలీసు ఇన్‌ఫార్మర్‌గా, తరువాత గ్యాంగ్‌స్టర్‌గా మారిన విధానాన్ని తన చిత్రంలో చూపించబోతున్నాడని, ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తాడని అంటున్నారు. ఇప్పటికే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాడని సమాచారం. ఈ విషయంపై ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మరి ఈ సినిమాతో ఇంకెలాంటి సంచలనాలు రేపుతాడో చూడాలి.