ధనుష్ నటన అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్, రిచా గంగోపాధ్యాయ జంటగా ఓం శివగంగ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై శ్రీరాఘవ (సెల్వరాఘవన్) దర్శకత్వంలో రూపొందించిన ‘మయక్కం ఎన్నా’ చిత్రాన్ని తెలుగులో కె.బాబురావు, కె.మల్లికార్జున్ ‘మిస్టర్ కార్తీక్’గా అనువదించారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాలోని పాటలను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మంగళవారం విడుదల చేశారు. థియేటర్ ట్రైలర్‌ను దర్శకుడు సముద్ర, రాజ్‌కందుకూరి ఆవిష్కరించగా, సీడీని నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేసి తొలి కాపీని ఆర్.కె.గౌడ్‌కు అందించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, తమిళంలో మంచి విజయం సాధించిన లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెలుగులోనూ హిట్ అవుతుందన్న నమ్మకం వుందని తెలిపారు. ధనుష్ నటన ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటుందని, ఓ అందమైన కథకు అద్భుతమైన కథనం జోడించి స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఫైట్స్, పాటలు ప్రత్యేక ఆకర్షణగా వుంటాయని వారు తెలిపారు. తెలుగువారికి పరిచయమైన రిచా గంగోపాధ్యాయ పాత్ర ఈ సినిమాలో సరికొత్తగా వుంటుందని, ఓ బలమైన కారణంతో హీరో హీరోయిన్లు తమ జీవితాలను ఎలా మలచుకున్నారు అన్న కథనంతో ఈ సినిమా సాగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో నాగేశ్ నారదాశి, భూషణ్, వెంకట్ మల్లూరి చిత్ర విశేషాలను తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం:జి.వి.ప్రకాష్, పాటలు:శశాంక్ వెనె్నలకంటి, నిర్మాతలు:కె.బాబురావు, కె.మల్లికార్జున్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీరాఘవ.