అభీ న జావో ఛోడ్‌కర్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఓ వెలుగువెలిగిన అలనాటి అందాల తార సాధన శివదాసాని కన్నుమూశారు. ఆమె వయస్సు 74 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శనివారం అంత్య్రక్రియలు నిర్వహిస్తారు. థైరాయిడ్ సమస్యతోపాటు క్యాన్సర్‌కు గతంలో చికిత్స పొందిన ఆమె కొద్దికాలం క్రితం ఓ సేవా కార్యక్రమంకోసం ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేసి ఔరా అన్పించారు. హీరోహీరోయిన్లు జనబాహుళ్యంలోకి ఎక్కువగా వెళ్లకూడదని, లోప్రొఫైల్‌లోనే ఉంటే మంచిదని ఆమె భావించేవారు. ఆ అభిప్రాయంతోనే ఆమె ఎన్నడూ ప్రచారార్భాటాలకు పోలేదు. ఆనాటివారికి సాధనగా ఆమె పరిచయమే. మరో అందాలతార వహీదారెహ్మాన్, హెలన్‌లకు ఆమె మంచి స్నేహితురాలు. హిందీచిత్రసీమలో 1960-70 దశకంలో ఆమె తిరుగులేని నటిగా రాణించారు. నుదుటిపైకి ముంగురులు జారేలా సరికొత్త హెయిర్‌స్టైల్‌తో సంచలనం సృష్టించిన సాధన ఆ తరువాత బిగుతైన చుడీదార్ దుస్తులతో కొత్త సంప్రదాయాన్ని బాలీవుడ్‌కు పరిచయం చేసి, అందరిదృష్టినీ ఆకర్షించారు. ఈమె హెయిర్ స్టైల్ ‘సాధన కట్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఆడెహెప్‌బర్న్ కేశాలంకరణ విధానాన్ని అనుకరించిన సాధన తనకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకుంది.
ఆ కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణుల్లో సాధన ఎప్పుడూ మొదటి మూడు స్థానాల్లో ఉండేవారు. దేశవిభజనకు ముందు, 1941లో కరాచీలో సింధు కుటుంబంలో పుట్టిన ఆమె చిన్ననాటినుంచి సినిమాల్లోకి రావాలని తహతహలాడారు. అక్కడినుంచి ముంబైకి తరలివచ్చిన తరువాత తండ్రి ఆమెను ప్రోత్సహించారు. ఆయన అభిమాన తార సాధనబోస్ పేరులో తొలి మూడక్షరాలను కూతురికి పేరు పెట్టారు. 1955లో రాజ్‌కపూర్ చిత్రం ‘శ్రీ 410’లో నృత్యబృందంలో తొలిసారి నటించిన ఆమె పదిహేనేళ్ల ప్రాయంలో ‘అబానా’ అనే సింధీ చిత్రంలో హీరోయిన్‌గా తొలిసారి నటించారు. ‘వొకౌన్ థి’ చిత్రంలో మనోజ్‌కుమార్‌తో కలిసి నటించిన ఆమె విమర్శకుల మెప్పుపొందారు. అందం, అభినయంలో ఆమె మంచిపేరు తెచ్చుకున్నారు.‘లవ్ ఇన్ సిమ్లా’ హిందీచిత్రంలో హీరోయిన్‌గా నటించి హిట్‌కొట్టడంతో ఇక ఆమె అనంతరం అనాటి మేటి హీరోలందరితోనూ నటించి మెప్పించారు. లవ్ ఇన్ సిమ్లా దర్శకుడు రామకృష్ణనయ్యర్‌తో ప్రేమలోపడి ఆ తరువాత వివాహం చేసుకున్నారు. ‘మేరా సాయా’, ‘వక్త్’, ‘వోకౌన్‌థి’, ‘గీతా మేరే నామ్’, ‘ఇంతెకామ్’వంటి సినిమాల్లో నటించి రాణించారు. గీతామేరానామ్ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలుకూడా నిర్వహించిన ఆమె భర్తతో కలిసి ఫిల్మ్‌ప్రొడక్షన్ సంస్థను ఏర్పాటుచేసి 1989లో డింపుల్‌కపాడియాతో నిర్మించిన ఓ సినిమాకు సాధన దర్శకత్వం వహించారు. 1995లో భర్త నయ్యర్ ఆస్తమాతో బాధపడుతూ మరణించారు. వారికి పిల్లలు లేరు. కళ్లలో భావాలు పలికించగల నటిగా ఆమె పేరుపొందారు. అయితే థైరాయిడ్ సమస్యవల్ల ఆమె కంటిచూపు దెబ్బతింది. అందుకే సినిమారంగంనుంచి తప్పుకున్నాక ఫొటోలు తీయించుకునేందుకు ఆమె ఇష్టపడేవారుకాదు. ప్రేక్షకుల మదిలో తనెప్పుడూ ఆనాటి తెరవేల్పుగానే గుర్తుండిపోవాలని అనుకునేవారు. కాగా సాధన మృతిపట్ల బాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది.
పాటంటే సాధనదే!
సాధన అభినయించిన ప్రతి పాట ఆనాటి ప్రేక్షక లోకానికి కనువిందు చేసింది. లతామంగేష్కర్ పాడిన పాటల్లో సూపర్ హిట్‌లుగా పేర్కొనే చాలా పాటలు సాధనపై చిత్రీకరించినవే. ‘తు జహా జహా చలేగా మెర సాయా సాథ్‌హోగా’..కౌన్ ఆయాకి నిగాహోమె చమక్ జాగ్ ఉఠీ’..జుమ్‌కా గిరారే’..ఓ సజ్‌నా బర్‌కా బహారాయే..’బేదర్‌దీ బాల్‌మా తుజ్‌కో..’..‘లగ్‌తా గలే..’ ‘అభిన జావో ఛోడ్‌కే..’, తుజె జీవన్‌కి డోర్‌సే బాంద్ లియాహై’..‘బహుత్ షుక్‌రియా..మెరె జిందగీమే హుజూర్ ఆప్ ఆయే..’ఇలా సోలో పాటలైనా యుగళ గీతాలైనా సాధన మార్కు మైమరిపించేది..