నవ్వులు రువ్వే జో అచ్యుతానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్యపాత్రల్లో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనాతో ఇంటర్వ్యూ...

ఈ సినిమాకు ఓకె చెప్పడానికి కారణం?
- దర్శకుడు శ్రీని చెప్పిన కథ నచ్చింది. ఈ సినిమా కథ చెప్పినపుడు ఎంతో ఎగ్జైట్‌గా అనిపించింది. వింటున్నంతసేపూ ఓ అందమైన స్మైల్ ముఖంలో కనిపిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్‌లో ఈ తరహా నేచురల్ స్టోరీస్ వర్కవుటవుతాయి. అందుకే ఈ సినిమా ఓకె చేశాను.
మీ పాత్ర గురించి?
- నా కెరీర్‌లో మోస్ట్ ఫన్నీ రోల్ ఇది. ఇంత తక్కువ స్పాన్‌లో అలాంటి మంచి క్యారెక్టర్ రావడం అదృష్టం. ప్రతి సినిమాలో గాళ్ నెక్స్ట్‌డోర్ పాత్రలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర అలాంటిదే. ఆ రోల్ నవ్విస్తుంది. కోపం తెప్పిస్తుంది. ఎమోషన్‌లోకి తీసుకెళుతుంది. నా పాత్రతో ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ అవుతారు.
నారా రోహిత్‌తో మీ కాంబినేషన్ ఎలా వుంటుంది?
- రోహిత్‌తో ఇంతకుముందే ‘శంకర’ సినిమా చేశా. అప్పటినుంచి తనతో బాండింగ్ ఉంది. నేను చెన్నైలో తమిళ సినిమాలతో బిజీగా వున్నప్పుడే ఇక్కడికి వచ్చి రోహిత్‌ని కలిశాను. పది నిమిషాలపాటు నా రోల్ గురించి వివరించి చేయండి అంటూ రోహిత్ చెప్పాడు. రోహిత్ అమేజింగ్. ఈ సినిమా మేకింగ్ వీడియో చూస్తే అతడి ప్రతిభ తెలుస్తుంది. ఈ సినిమా సెట్స్‌లో అంతా ఒక పిక్నిక్‌లా సాగింది.
బాలీవుడ్‌లో ఛాన్స్ ఎలా వచ్చింది?
-తెలుగులో నా సినిమాలన్నీ చూసి హిందీ ఛాన్స్ ఇచ్చారు. ‘ఆంఖే-2’కి ఎంపిక చేసుకున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ వుంటుంది. ఈ సినిమాలో నేను గ్లామర్ రోల్‌లోనే కనిపిస్తా.
తదుపరి సినిమాల గురించి?
- కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాలో చేస్తున్నాను. నిజంగా ఆయనతో పనిచేయడం చాలా లక్కీగా ఉంది. ఎందుకంటే చాలా జీనియస్ దర్శకుడాయన. ప్రతి చిన్న విషయాన్నీ క్లియర్‌గా గమనిస్తారు. ఈ సినిమా కూడా బాగుంటుంది. ఇక తెలుగులో మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అలాగే తమిళంలో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నా..

-శ్రీ