పెళ్లిచూపులుకన్నా బాగుండే ద్వారక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌గుడ్ ఫిలింస్ (ఆర్.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘ద్వారక’. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ, తమ బ్యానర్‌లో రూపొందుతున్న 90వ చిత్రమిదని, ఇప్పటివరకు చాలామంది నటీనటులను, టెక్నీషియన్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశామని, ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నిర్మాతలు ప్రద్యుమ్న, గణేష్‌లతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుందని, దర్శకుడు శ్రీనివాస్ రవీంద్రను ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నామని అన్నారు. ఒక సాంగ్ మినహా సినిమా అంతా పూర్తయిందని, అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ, ‘పెళ్లిచూపులు’ కంటే విజయ్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని, డిఫరెంట్ సబ్జెక్ట్ వున్న ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ చేయడం రేర్‌గా జరుగుతుంటుంది అన్నారు.
నిర్మాత ప్రద్యుమ్న మాట్లాడుతూ, సోషల్ మెసేజ్‌తో కూడిన సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదని, అలాంటి 90 సినిమాలను చేసిన చౌదరితో కలిసి ఈ సినిమాను చేసినందుకు ఎంతో ఆనందంగా వుందన్నారు.సినిమా బాగా వచ్చిందని అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ‘పెళ్లిచూపులు’ కంటే ముందుగానే ఈ స్టోరీ విన్నానని, చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ సినిమా ఆర్.బి.చౌదరి, బ్రహ్మకడలి, సాయికార్తీక్ వంటి టాప్ టెక్నీషియన్స్ సపోర్ట్ ఓ పెద్ద సినిమాగా మారిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజ, బ్రహ్మకడలి, నవీన్, గిరిధర్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.