తెలుగులోనూ నటిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల పోటీల్లో నెగ్గి కన్నడలో తొలి సినిమా ఛాన్స్ కొట్టేసిన కొత్త హీరోయిన్ నక్షత్ర తెలుగులో అవకాశాలు వస్తే నటిస్తానని చెబుతోంది. అందాల పోటీలు అంటే మాటలు కాదు. ఎంతోమంది సుందరీమణులు పోటీపడతారు. అందులో పోటీచేసి విజేతగా నిలవడం అంత సులువైన పనేమీ కాదు. ఆ సెలక్షన్‌లో ఈసారి మిస్ సౌత్ ఇండియా 2016గా కిరీటం కొట్టేసిన బ్యూటీ ‘నక్షత్ర’. మిస్ సౌత్ ఇండియా టైటిల్‌ను తను ఊహించలేదనీ.. కనీసం రన్నరప్‌గా గెలిచినా చాలు అనుకున్న తనకు ఏకంగా టైటిల్ దక్కడం చాలా హ్యాపీగా ఉందని చెబుతోంది. ఇక అందాల పోటీలు అంటే వెండితెరకు ఎంట్రీ టికెట్ లాంటివి.. అందుకే టైటిల్‌ను గెలుచుకోగానే నక్షత్రకు కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ ‘రాక్‌లైన్ వెంకటేష్ తను తీస్తోన్న లేటెస్ట్ సినిమాలో తీసుకున్నాడు. అలాగే మరో రెండు సినిమాలు కథాచర్చల్లో ఉన్నాయని చెప్పింది. ఒక రకంగా తన కల నెరవేరిందని చెబుతోంది నక్షత్ర. చిన్నప్పటినుంచే తనకు యాక్టింగ్ అంటే పిచ్చి అని, చాలా చిన్న వయసునుంచే తనూ హీరోయిన్ కావాలని కలలుకన్నానని చెబుతోంది. అతి త్వరలోనే తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది నక్షత్ర.