సుడిగాలి వీస్తే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీ అధికారి, కులకర్ణి మమత, వెంకటేష్‌గౌడ్, మల్లేష్‌యాదవ్ ప్రధాన తారాగణంగా శివపార్వతి క్రియేషన్స్ పతాకంపై రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టిపల్లి వెంకటేష్‌గౌడ్, బిరాదర్ మల్లేష్‌యాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘సుడిగాలి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, సుడిగాలి అనే పదం మనం ఎప్పుడూ వింటూనే వుంటామని, ఆ సుడిగాలి వీచినప్పుడు ఎంత గందరగోళం జరుగుతుందో అంత గందరగోళం సుడిగాలిలో వున్న దెయ్యంతో ఎలా జరిగింది అన్న కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగ జరుపుతున్నామని, నటీనటులు కొత్తవాళ్లైనా బాగా నటిస్తున్నారని అన్నారు. టైటిల్‌కు తగిన విధంగా కథనం సరికొత్తగా వుంటుందని ఆయన తెలిపారు. హారర్, కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటివరకు వచ్చిన అలాంటి చిత్రాలకు భిన్నంగా సాగుతుందని, సుడిగాలి వీచినప్పుడు ఎన్ని విపరీతాలు జరుగుతాయో ఈ చిత్రంలో చెబుతున్నామని నిర్మాతలు అన్నారు.