దృశ్యకావ్యంగా ఘటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యామీనన్ ప్రధాన పాత్రలో క్రిష్ జె.సత్తార్ కథానాయకుడుగా మలయాళంలో రూపొందిన ‘22 ఫిమేల్ కొట్టాయం’ చిత్రాన్ని శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమాను సన్‌మూన్ క్రియేషన్స్ పతాకంపై వి.ఆర్.కృష్ణ ఎం. తెలుగులో ఘటన పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ.. దృశ్యం లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీప్రియ దృశ్యకావ్యంలాంటి ఘటన చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారని, నరేష్, కోట శ్రీనివాసరావు నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హిట్ అయిందని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరగనుందని తెలిపారు. అప్పట్లో ప్రతిఘటన ఎంత విజయం సాధించిందో అంతే విజయాన్ని ఈ సినిమా అందుకుంటుందని, లేడీ ఓరియంటెడ్ కథనాల్లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందని ఆయన చెప్పారు. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని భారీ ఆఫర్‌తో రైట్స్ తీసుకుని రూపొందించామని, ఈనెల 31న ప్లాటినమ్ డిస్క్ వేడుకలు జరపనున్నామని నిర్మాత వి.ఆర్.కృష్ణ ఎం. అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు. దర్శకురాలు శ్రీప్రియ ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి ఓ కొత్త ఫ్లేవర్ ఉన్న కథతో ఈ సినిమా రూపొందించారని, యూత్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతుందని నటుడు నరేష్ తెలిపారు. నిత్యామీనన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన ఈ చిత్రంలో తనది క్రిష్‌సత్తార్ పాత్రల చుట్టే సినిమా సాగుతుందని తెలిపారు. సమాజంలో ప్రస్తుతం ఉన్న ఓ సమస్యను తీసుకుని రూపొందించిన ఈ చిత్రం తప్పక విజయవంతవౌతుందని ఆయన అన్నారు. కోవై సరళ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అంజలీరావు, జానకి, గౌతమి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పిళ్లై, ఎడిటింగ్: భవన్‌శ్రీకుమార్, సంగీతం: అరవింద్ శంకర్, పాటలు: అనంత్‌శ్రీరామ్, నిర్మాత: వి.ఆర్.కృష్ణ ఎం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ.