పిటి ఉష జీవితకథలో సోనమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా మామూలుగా లేదు. ఇప్పటికే ఈ తరహా సినిమాలు బాక్సాఫీస్‌వద్ద దుమ్మురేపుతున్నాయి. దాంతో ఈ సినిమాలకు బాలీవుడ్‌లో మంచి గిరాకీ ఏర్పడింది. ఈ తరహా స్ఫూర్తినిచ్చే జీవిత కథల అనే్వషణలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుంది హాట్ భామ సోనమ్‌కపూర్. బాలీవుడ్‌లో ఈమధ్య కెరీర్ హ్యాపీగా లేని ఈ అమ్మడికి ‘నీర్జా’ సినిమా కాస్త రిలీఫ్‌ని ఇచ్చింది. దాంతో ఇప్పుడు బయోపిక్ చేయడానికి ఫిక్స్ అయింది సోనమ్. ఈసారి ఆమె చేసే సినిమా ఎవరిదో తెలుసా.. పరుగుల రాణి పి.టి. ఉష జీవితకథ. ఇప్పటికే క్రీడాకారులు ‘మేరీకోమ్’, ‘మిల్కాసింగ్’ల జీవితం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో పిటి ఉష చేరింది.