పూలరంగడిలా హిట్ కొడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 చిత్రం సాంగ్స్ రికార్డింగ్ కార్యక్రమం శుక్రవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రారంభమైంది. ఎన్.శంకర్ దర్శక నిర్మాణంలో రూపొందనుంది. మలయాళ సినిమా టు కంట్రీస్ చిత్రానికి ఇది రీమేక్. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమా సాంగ్ రికార్డింగ్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరో సునీల్ మాట్లాడారు. ‘టు కంట్రీస్’ సినిమా చూడగానే నచ్చిందని, మలయాళంలో దిలీప్ చేసిన సినిమా ఇదని సునీల్ వివరించారు. దిలీప్ నటించిన ఓ సినిమా గతంలో ‘పూలరంగడు’ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ సాధించానని, ఆయన సినిమాలు అచ్చిరావడంతో ఈ సినిమా చేస్తున్నానని, ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఉంటుందని అన్నారు.‘పూలరంగడు’ సినిమాకు డైలాగ్స్ అందించిన శ్రీ్ధర్ సీపాన ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నాడని, అలాగే గోపీసుందర్‌తో తొలిసారి వర్క్ చేస్తున్నానని, మ్యూజిక్ ఫ్రెష్‌గా ఉంటుందని, నా స్టయిల్‌లో ఉంటూ సరదాగా సాగే సినిమా ఇది అన్నారు. దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ మలయాళ సినిమా ‘టు కంట్రీస్’ చూశానని, నచ్చడంతో సునీల్‌కి యాప్ట్ అవుతుందనిపించి వారిని కూడా సినిమాను ఓసారి చూడమని చెప్పానని, ఆయనకు కూడా విపరీతంగా నచ్చడంతో సినిమా మొదలైందన్నారు. మలయాళంలో 55 కోట్లు కలెక్ట్‌చేసిన ఈ చిత్రం కామెడీ ఎంటర్‌టైనె్మంట్ అయినా అన్ని ఎమోషన్స్ ఉంటాయని, దిలీప్ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించాయని, ఈ పాత్ర సునీల్ తప్ప ఎవరూ చేయలేరని అన్నారు. నా సినిమాలన్నీ కానె్సప్ట్ బేస్డ్‌గా ఉంటాయని, ఇది యూనివర్సల్ మూవీ అని, అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందని అన్నారు.
మాతృతకకు కూడా ఆయనే సంగీతం అందించారని, ఒరిజినల్‌లో కూడా కొన్ని సాంగ్స్‌తోపాటు కొత్త సాంగ్స్ కూడా యాడ్ చేస్తామని, సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు సినిమా షూటింగ్ జరుగుతుందని, పదిహేను రోజులు హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తామని అన్నారు. తర్వాత షెడ్యూల్ అవుట్‌డోర్‌లో ఉంటుందని, 70 శాతం సినిమా అమెరికాలో చిత్రీకరిస్తామని చెప్పారు. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో జరిగే సినిమా. అలాగే ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా స్క్రిప్ట్‌ను మన నేటివిటీకి తగినట్లు మార్చి సినిమాను తెరకెక్కిస్తాం. సునీల్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: గోపీసుందర్, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్.