గీతా ఆర్ట్ స బ్యానర్‌లో చిరు కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి రీఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నెం.150’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మెగాస్టార్ తదుపరి సినిమాకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పట్నుంచే మొదలయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే చిరు 151వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారన్నది తెలియనుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలిసింది. 150వ సినిమా లాగే ఆ తర్వాత వచ్చే సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అల్లు అరవింద్ ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇక చిరు 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ విషయానికి వస్తే తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.