మిస్టర్ 420 టర్నింగ్ పాయంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జెల హరికుమార్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘మిస్టర్ 420’. రియాన్ ముస్త్ఫా సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుణ్ సందేశ్ వివాహం అయ్యాక విడుదలవుతున్న ఈ చిత్రం తప్పక విజయం సాధించాలన్నారు. ఈ సినిమా టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని, కథాకథనాలు సరికొత్తగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, వరుణ్‌సందేశ్ ఈ చిత్రంతో ఓ సరికొత్త ఇమేజ్‌ని తెచ్చుకుంటాడని దర్శకుడు తెలిపారు. క్వాలిటీ విషయంలో రాజీపడకుండా రూపొందించిన ఈ చిత్రం తనకు టర్నింగ్ పాయింట్‌లా నిలుస్తుందని వరుణ్ సందేశ్ తెలిపారు. ఓ మంచి సినిమా తీశామన్న నమ్మకం కుదిరిందని, వరుణ్ సందేశ్ నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్‌గా ఉంటుందని నిర్మాత హరికుమార్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, కె.ఎల్.దామోదరప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. షాయాజీషిండే, రఘుబాబు, పృథ్వి, సాయి, షానీ, శేఖర్, జీవా, రఘు, రచ్చరవి, మీనా తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, అనంత శ్రీరామ్, ఎడిటింగ్: నందమూరి హరి, కెమెరా: జశ్వంత్, మాటలు: మోహన చంద్ర, నిర్మాత: హరికుమార్ రెడ్డి గజ్జెల, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్.