8న ఓ మైగాడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనీష్, మేఘశ్రీ, పావని ప్రధాన తారాగణంగా శ్రీ వెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వి.శ్రీవాత్సవ్ దర్శకత్వంలో వేణు ముక్కపాటి రూపొందించిన చిత్రం ‘ఓ మైగాడ్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 8న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత వేణు మాట్లాడుతూ కథ చెప్పగానే ఎంతో నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నానని, నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో దర్శకుతు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, సెన్సార్‌వారి అభినందనలు అందుకున్న ఈ చిత్రాన్ని వచ్చేనెల 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
తొలి చిత్రమైనా నిర్మాత ఇచ్చిన స్వేచ్ఛతో నచ్చిన విధంగా చిత్రాన్ని రూపొందించానని, రాజ్‌కిరణ్ అందించిన సంగీతం చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని, హారర్ కామెడీ జోనర్‌లో వున్న కథ అని చెప్పడం కంటే ఓ సోషియో ఫాంటసీ కథనమని చెప్పాలని, ఇప్పటివరకు చేయని సరికొత్త జోనర్‌లో రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రాజు తోట, ఎడిటింగ్: ఉపేంద్ర, మ్యూజిక్: రాజ్‌కిరణ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: రోషన్ సాలూరి, కోప్రొడ్యూసర్: చనమాల పురుషోత్తం, నిర్మాత: వేణు ముక్కపాటి, దర్శకుడు: శ్రీవాత్సవ్.