ఎన్టీఆర్ ధడ్‌కన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలన్నీ జరిగాయి. రచయితగా ప లు హిట్ చిత్రాల ను రూపొందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయవౌతూ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ చిత్రం వచ్చేనెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘్ధడ్‌కన్’ అనే టైటిల్‌ను ఓకే చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ టైటిల్‌ను ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారట. ఈ చిత్రాన్ని కూడా కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని తెలిసింది. అలాగే మరో ముఖ్యపాత్రలో ప్రముఖ నటుడు జగపతిబాబు నటిస్తాడట. త్వరలోనే మిగతా టెక్నీషియన్లను, ఆర్టిస్టులను అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.