‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయూఖ క్రియేషన్స్ పతాకంపై జగదీష్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని రూపొందించిన చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. నవీన్‌చంద్ర, లావణ్యత్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రం నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, కీరవాణి బాణీలు హైలెట్‌గా ఉన్నాయని తెలిపారు. అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ట్విస్టులు అందరికీ నవ్వులు తెప్పిస్తాయని, ప్రతి ఒక్కరూ చూడదగిన విధంగా ఉంటుందని తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి, జనవరి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, నర్రా శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: ఈశ్వర్, రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల.