వైశాఖం ఓ బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి అద్భుతమైన పాటల స్వరకర్త, సంగీత దర్శకుడు సత్యం మనవడిగా వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకుని సంగీతాన్ని అందిస్తున్నాడు డి.జె.వసంత్. ‘మడతకాజా’ సినిమాతో ప్రారంభమైన ఆయన కెరీర్, సుడిగాడు, స్పీడున్నోడు చిత్రాల తరువాత ఊపందుకుంది. ప్రస్తుతం ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు అందిస్తున్న ‘వైశాఖం’ చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా డి.జె.వసంత్ పాత్రికేయులతో పలు విశేషాలను ముచ్చటించారు.

ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఇదీ
ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. వైశాఖం సినిమా పుట్టినరోజు గిఫ్ట్‌గా భావిస్తున్నాను. సినిమాలో పాటలన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయి. ఖచ్చితంగా ఆడియో పెద్ద హిట్ అవుతుంది.
తాత సత్యం ప్రేరణతోనే..
తాతగారైన సత్యం ప్రేరణతోనే పరిశ్రమకు వచ్చాను. అనేకమంది పెద్ద సంగీత దర్శకుల వద్ద పనిచేశా. కంపోజింగ్ చేయడంతోపాటుగా పాటలు కూడా రాశా.
తాతగారి నుంచి నేర్చుకున్నా
ఏ సినిమా అయినా సరే మన ఎఫర్ట్ మనం పెట్టాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది రిలీజ్ అయ్యేవరకూ ఎవరూ చెప్పలేరు. ఈ విషయాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆయన డోలక్ బీట్ అంటే చాలా ఇష్టం. మెలోడీ పాట అయినా సరే, అందులో బీట్ వుండాలని ఆయన కోరుకునేవారు. అది కూడా నా పాటలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నా.
వైశాఖం పాటలు అద్భుతం
నా పుట్టినరోజు కానుక అని ధీమాగా చెబుతున్నానంటే అదే అర్థం. ఉన్న ప్రతి పాటా దర్శకురాలు ఇచ్చిన స్వేచ్ఛతో చక్కగా చేశా. పాటలు విన్న తరువాత మరింత నమ్మకం పెరిగింది. చిన్న సినిమాగా ప్రారంభమైన వైశాఖం పెద్ద సినిమాగా మారింది. ఆడియో ఈ చిత్రానికి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది.
ఆ మెచ్చుకోలుతో ఆనందం
దర్శకురాలు జయ గతంలో చేసిన చిత్రాలను పరిశీలించి ప్రతీ పాటా ఆమె హిట్ చేయాలని భావిస్తారని గుర్తించాను. అలాగే, ఈ చిత్రం కోసం కూడా కష్టపడ్డాను. పాటలు విన్నాక మెచ్చుకోవడం ఆనందాన్నిచ్చింది.
ఆ పాట హైలెట్
ఇందులో అన్ని రకాల పాటలు ఉన్నాయి. మెలోడీమీద ప్రేమ ఎవరికైనా వుంటుంది. మనం చూస్తున్న అనేక లొకేషన్స్ మాత్రం ఈ పాటల్లో కనపడవు. అన్నీ ఫ్రెష్‌గా వుంటాయి. ఇది ఓ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కథ. డిఫరెంట్ జోనర్‌లో లవ్‌స్టోరీతోపాటు సందేశం కూడా వుంటుంది. ఎలాగోలా బ్రతికేద్దాం అని కాకుండా ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నించే సినిమా ఇది.
సంగీతం కాకుండా మరేదైనా చేస్తారా?
నాకంటూ సపరేట్ ప్లాన్స్, డ్రీమ్స్ లేవు. చిన్నప్పటినుండి సంగీతం తప్ప ఏమీ తెలియదు. అప్పుడప్పుడు పాటలు రాస్తాను, అంతే. వైశాఖంతో మరోసారి రైటర్‌గా మారా. ఆ పాట మగవారికి బాగా నచ్చుతుంది. ఆడవాళ్ళు తిడతారనుకుంటా.
నెక్స్ట్ ప్రాజెక్టులు
సత్యా దర్శకత్వంలో ఓ సినిమా, నరేష్‌తో మలయాళ రీమేక్ మరో చిత్రం, ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఇంకో చిత్రంతోపాటుగా ఈ సంవత్సరం ఆరు సినిమాలు రన్నింగ్‌లో వున్నాయి.

-శ్రీ