రాజకీయాల్లోకి నయనతార?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ నయనతార ఇప్పుడు కోలీవుడ్‌లో మంచి జోరుమీదుంది. ఇప్పటికే గ్లామర్‌తో ఆకట్టుకుంటూ.. అటు స్టార్ హీరోల సరసన, ఇటు యువ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ జోరుమీదుంది. ఇటీవలే తెలుగులో వెంకటేష్ సరసన ‘బాబు బంగారం’ చిత్రంలో నటించిన ఈ భామ ఇప్పుడు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఇప్పటికే ఆమె ఎఐఎడిఎంకె పార్టీతో మంచి సంబంధాలు కొనసాగిస్తోంది. జయలలితతో ఈమధ్యే చర్చలు కూడా జరిపిందని సమాచారం. అంతేకాదు, ఆ పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటోందికూడా. ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిగ్గా మారింది. మొత్తానికి త్వరలోనే నయనతార రాజకీయాల్లో ఫుల్ ప్లెడ్జెడ్‌గా చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.