ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో సంచలన విజయం సాధించిన ‘తరకప్పు’ చిత్రాన్ని తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’గా అనువదిస్తున్నారు. శక్తివేల్ వాసు, సముద్రఖని ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రాన్ని వి.జె.వై.ఎస్.ఆర్ ఆర్ట్స్ పతాకంపై రవి దర్శకత్వంలో వై.శేషిరెడ్డి అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో అందించడం సరికొత్తగా వుందని, సముద్రఖని, శక్తివేల్ నటన పోటాపోటీగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు సరికొత్తగా తెరకెక్కించారని, రెండు జంటలమధ్య జరిగే చిలిపి విన్యాసాల కథనంతో సాగే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేశామని, ఈనెల రెండోవారంలో ఆడియోను విడుదల చేసి అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. వైశాలి, రియాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:ఎం.రాజశేఖరరెడ్డి, కెమెరా:జోన్స్ ఆనంద్