రెగ్యులర్ షూటింగ్‌లో కుర్ర తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాదె తరుణ్, తేజ్, భావన ప్రధాన తారాగణంగా సిక్స్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ పతాకంపై శ్రీరామచంద్ర గొర్రెపాటి సమర్పణలో డా కృష్ణమోహన్ రూపొందిస్తున్న చిత్రం ‘కుర్ర తుఫాను’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- మంచి ఔట్‌పుట్ కోసమే సినిమా షూటింగ్ ఆలస్యమైనా రాజీపడకుండా చేస్తున్నామని, ఈ నెలతో షూటింగ్ పూర్తిచేస్తామని అన్నారు. ఓ అందమైన కథనానికి అద్భుతమైన స్క్రీన్‌ప్లే జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయని, అక్టోబర్‌లో ఆడియో విడుదల చేసి సంక్రాంతికిగాని, లేదా వేసవికిగాని ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. హరికృష్ణ, బ్రహ్మానందం, అలీ, ఉత్తేజ్, రాజీవ్ కనకాల, రచ్చరవి, ఘంటా విజయ్, శ్రీచరణ్, సిద్ధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:గోపాల్ సామ్రాట్, సంగీతం:టి.పి.్భరద్వాజ్, పాటలు:చంద్రబోస్, విజయ్‌కుమార్, నిర్మాణం: సిక్స్ ఫ్రెండ్స్ యూనిట్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డాక్టర్ గొర్రెపాటి కృష్ణమోహన్.