ధనుష్ రైల్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్ కథానాయకుడిగా, కీర్తి సురేష్ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రైల్’. ఆదిత్య మూవీ కార్పొరేషన్, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్ పతాకాలపై ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కాబోతోంది. నిర్మాతలు ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ, హీరో ధనుష్‌కి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ వుందో అందరికీ తెలిసిందేనని, ఆయన నటించిన ‘రఘువరన్ బి.టెక్’ సూపర్ డూపర్ హిట్ అయి కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అయిందని గుర్తు చేశారు. ధనుష్‌తోపాటు, ‘నేను శైలజ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన హీరోయిన్ కీర్తి సురేష్ కాంబినేషన్‌లో ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రైల్’. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్ 3న విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్ 16న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.