బోయపాటికి 151 చాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి 151వ సినిమా దర్శకుడు బోయపాటేనా? అంటే ఔననే అంటున్నాయి సినీవర్గాలు. ‘సరైనోడు’తో మాస్ హిట్ కొట్టాడు బోయపాటి శ్రీను. వందకోట్లకిపైగా వసూళ్లు సాధించింది ఆ చిత్రం. ఆ సినిమాకి సంబంధించిన ఓ వేడుకలో స్వయంగా చిరంజీవి మాట్లాడుతూ తాను బోయపాటితో సినిమా చేయడానికి రెడీ అని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేడు. అంతకంటే బంపర్ ఆఫర్ బోయపాటికి ఇంకేముంటుంది? ఆ మాటతో బోయపాటి ప్లానింగ్ అంతా మారిపోయిందని సమాచారం. నిజానికి ‘సరైనోడు’ తర్వాత ఆయన బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ చిరు తనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉండటంతో మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాని పక్కనపెట్టి బోయపాటి నేరుగా చిరుకోసమే కథ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకొన్నట్టు కుదిరితే చిరు 151వ సినిమా బోయపాటి దర్శకత్వంలో రూపొందనుంది.