కాటమరాయుడు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకులకు అదోక్రేజ్. పవన్ కూడా సాధ్యమైనంత వరకూ వైవిధ్యం ఉండేలా సినిమాను ఎంపిక చేసుకుంటారు. అందులోభాగంగానే పవన్ నటించే తదుపరి సినిమాకు వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పవన్‌కల్యాణ్ తదుపరి సినిమా పేరు ‘కాటమరాయుడు’ అని ఖరారు చేశారు. డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ప్రేమకథ. 2013లో చేసిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘కాటమరాయుడా..’ అనే పాటను స్వయంగా పవనే పాడటంవలన ఈ పేరు అభిమానుల్లో బాగా నానిపోయింది. ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారు. సినిమా టైటిల్ ఖరారైన విషయాన్ని నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్‌లో గురువారం వెల్లడించారు.శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌లో పవన్ త్వరలో పాలుపంచుకోనున్నారు.