రీ ఎంట్రీకి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో బాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న గ్లామర్ భామ శిల్పాశెట్టి రీ ఎంట్రీకి సన్నాహాలు మొదలుపెట్టింది. హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల్ని మత్తెక్కించిన ఈ భామ ఈమధ్యే రాజ్‌కుంద్రాని వివాహం చేసుకుని ఓ బిడ్డకు తల్లైంది కూడా. సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈమె అప్పుడప్పుడు పలు సినీ కార్యక్రమాల్లో మెరుస్తూ ఉండేది. దాంతోపాటు రియాలిటీ షోలో కూడా పాల్గొన్న శిల్ప ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగానే సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడెలాగూ హీరోయిన్ పాత్రలు రావు కాబట్టి, అక్కా, తల్లి పాత్రల్లో నటించేందుకు సిద్ధమని చెప్పకనే చెబుతోంది. పైగా నేనిప్పుడు ఓ బిడ్డకు తల్లిని కాబట్టి తల్లిపాత్రల్లో నటించడం తప్పేమీ కాదని కౌంటర్లు కూడా వేస్తోంది. మొత్తానికి శిల్ప చెక్కుచెదరని గ్లామర్‌తో మళ్లీ ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది.