దసరా కానుకగా ఇజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాధ్ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ, నందమూరి కల్యాణ్‌రామ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇజం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పెయిన్‌లో చేసిన భారీ షెడ్యూల్‌తో పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, కల్యాణ్‌రామ్ జర్నలిస్టుగా ఓ పవర్‌ఫుల్ పాత్రలో తొలిసారిగా సిక్స్ ప్యాక్‌లో ఈ చిత్రంలో కనిపిస్తారని, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటూనే, డిఫరెంట్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. దర్శకుడిగా తనకు ఈ చిత్రం సవాల్‌లాంటిదని తెలిపారు. మంచి తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇప్పుడు విడుదల చేశామని, అభిమానులనుండి మంచి ఆదరణ లభిస్తోందని, ప్యాచ్‌వర్క్ మినహా పూర్తయిన చిత్రానికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత, హీరో నందమూరి కల్యాణ్‌రామ్ తెలిపారు. అతిథి ఆర్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, అలీ, ఈశ్వరీరావు, వెనె్నల కిశోర్, రఘు, శత్రు, అజయ్‌ఘోష్, శ్రీకాంత్, మాధవ, రవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా:ముఖేష్, ఎడిటింగ్:జునైద్, పాటలు:్భస్కరభట్ల, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.