పంచెకట్టు బాగుందంటే ఆనందంగా ఉంది.. నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి ప్రధాన తారాగణంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించారు. సినిమా పాటల సీడీలను దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేసి తొలి కాపీని నాగార్జునకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అన్నపూర్ణ సంస్థనుండి చిత్రాన్ని అందించి, రెండు సంవత్సరాలు అవుతోందని, నాన్న, తాను, నాగచైతన్య చేసిన ‘మనం’ చిత్రం పరువు నిలిపేలా ఈ చిత్రం వుంటుందని తెలిపారు. ఈ చిత్రంలో పల్లెటూరి వాతావరణంలో ఉండే కథానాయకుడి పాత్రలో పంచెకట్టుకు మంచి ఆదరణ లభిస్తుందని, అందరూ పంచె కట్టు అదిరిందని చెబుతుండడం ఆనందాన్నిస్తోందని అన్నారు. అనురాగం, ఆత్మీయత, అనుబంధాల కథనంతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు వారికి ఇష్టమైన సంక్రాంతి పండుగనాడు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయని తెలిపారు.
కళ్యాణకృష్ణ ఈ చిత్రాన్ని చక్కగా రూపొందించారని, తన తమ్ముడు సినిమాలో పంచెకట్టుతో డాన్స్ చేయాలని తానెప్పుడూ అనుకున్నట్లుగానే ఈ చిత్రంలో అలా డాన్స్‌చేశాడని, ఎ.నాగసుశీల తెలిపారు. 25 సంవత్సరాల క్రితం ఎంత ఎనర్జీతో ఉన్నారో అంతే ఎనర్జీతో ఈ చిత్రంలో నాన్న నటించారని అఖిల్ తెలిపారు. ఈ చిత్రంకోసం సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ అన్నారు. కార్యక్రమంలో సుమంత్, అమల, సుశాంత్, అనూప్ రూబెన్స్, రమ్యకృష్ణ, నాగచైతన్య, లావణ్యత్రిపాఠి, హంసానందిని తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, రచన: సత్యానంద్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.